శాశ్వత అన్నదానానికి విరాళం అందజేత
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం :పాల్వంచ మండలంలోని కేశవాపురం - జగన్నాధపురం గ్రామంలో వెలిసియున్న శ్రీ కనకదుర్గ దేవస్థానం (పెద్దమ్మతల్లి గుడి) లో త్వరలో చేపట్టబోయే శాశ్వత అన్నదానముకు ఖమ్మం రోటరీ నగర్ కు చెందిన ఎన్ మధు, యామిని దంపతులు రూ.1,11,116 లను విరాళంగా అందజేశారు. పూజల అనంతరం అర్చకులు ఆశీర్వచనంతో పాటు అమ్మవారి శేష వస్త్ర ప్రసాదాలను వారికి అందజేశారు.

Post a Comment