మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

 

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

జె.హెచ్.9. మీడియా, వెబ్ డెస్క్ :  మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీపావళి కంటే ముందే పొలిటికల్ బాంబులు పేలుతాయని అన్నారు. సియోల్ పర్యటనలో ఉన్న మంత్రి పొంగులేటి మీడియా తో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో అనేక అవకతవకలు జరిగాయని అన్నారు. 

అప్పట్లో ఫోన్ టాపింగ్ కు పాల్పడినట్లు తెలిపారు. ధరణి ఇతర 4,5 కుంభకోణాలు చేశారని అన్నారు. కుంభకోణాలలో ఏదో ఒకటి దీపావళి లోపే టపాసులా పేలుతుందన్నారు. తను సియోల్ నుంచి హైదరాబాదులో దిగేలోపే ఈ టపాసులు పేలడం ఖాయమని ఆయన అన్నారు. 

అరెస్టు చేయాలా, జీవిత కాలం జైల్లో పెట్టాలా అనేది చట్టం చూసుకుంటుంది అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో… రాజకీయాలు హాట్ హాట్ గా మారిపోయాయి. అసలు ఎలాంటి బాంబులు పేలబోతున్నాయని అందరూ చర్చించుకుంటున్నారు.

Blogger ఆధారితం.