పలు కార్యక్రమాల్లో పాల్గొన్న రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ కొత్వాల
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: పాల్వంచ పట్టణంలో సోమవారం జరిగిన పలు కార్యక్రమాల్లో డీసీఎంఎస్ చైర్మన్, రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు పాల్గొన్నారు. పాత పాల్వంచలో ముదిరాజ్ సంఘం నాయకులు అక్కల సీతారామయ్య మనుమడి వివాహ రిసెప్షన్ లో కొత్వాల పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. కేటీపిఎస్ కార్మికుడు, కొమ్ముగూడెం ( గొల్లగూడెం) నివాసి బొల్లి సమ్మయ్య దశదిన కర్మలో కొత్వాల పాల్గొని కుటుంబ సభ్యులను పరామర్శించి, సానుభూతి తెలిపారు.
రిటైర్డ్ హెడ్ మాస్టర్ నంది వీరభద్రం తల్లి ఇటీవల మరణించగా సోమవారం కొత్వాల వారి ఇంటికి వెళ్లి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పైడిపల్లి మనోహర్, సుధాకర్, వీరయ్య, వాసుమల్ల సుందర్ రావు, దారా చిరంజీవి, పైడిపల్లి మహేష్, సరవర్, సాంబయ్య, మొగిలి సంధ్య, హబీబ్, మొగిలి రమేష్, సరవయ్య, పాశం గోపాల రావు, యడ్ల ముత్యం తదితరులు పాల్గొన్నారు.

Post a Comment