ఏఐటీయూసీ అంగన్వాడీ అసోసియేషన్ లో చేరిన టీచర్స్
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: పాల్వంచ పట్టణంలోని ఏఐటీయూసీ కార్యాలయంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరాటి ప్రసాద్, ఏ.ఐ.కె.ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యాల విశ్వనాధం సమక్షంలో అంగన్వాడీ టీచర్స్ చేరారు.
ఈ సందర్బంగా ముత్యాల విశ్వనాథం, నరటి ప్రసాద్ మాట్లాడుతూ ఇండియాలో మొట్టమొదట ఆవిర్భవించిన ఏకైక కార్మిక సంఘం ఏఐటీయూసీ అని అన్నారు. అంగన్వాడీ టీచర్ లకు హెల్పర్స్ కు మెరుగైన వేతనాలు. ఉద్యోగ భద్రత, కోసం ఏఐటీయూసీ పోరాటం చేస్తుంది అని ఆయన తెలిపారు.అనంతరం మంజుల, దుర్గ, స్వర్ణ, వెంకటరమణ తోపాటు మరో 20 మంది అంగన్వాడి హెల్పెర్స్ ఏఐటీయూసీ లో చేరారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ పాల్వంచ మండల కార్యదర్శి వెంకట్ రావు, నాయకులు గిరి, కృష్ణ, సరోజని, సోయం రాజ్యలక్ష్మి, వెంకటరమణ, శ్రీదేవి,రాద, రాణి, నాగమణి, శాంత, సుమ, తదితరులు పాల్గొన్నారు.

.webp)
.webp)
Post a Comment