జ్యోతి వృద్ధాశ్రమంను సందర్శించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: జాతిపిత మహాత్మా గాంధీ, దేశ రెండవ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి ల జయంతి వేడుకలను పురస్కరించుకొని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ కొత్తగూడెం లోని జ్యోతి వృద్ధాశ్రమంను బుధవారం సందర్శించారు. అక్కడి పలువురు వృద్ధులను, మానసిక, శారీరక వికలాంగులను ఆయన పరామర్శించారు. నిర్వాహకులకు నిత్యవసర వస్తువులను సమకూర్చారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ మాట్లాడుతూ.
మానవసేవయే మాధవసేవ అని ఎక్కడో ఉన్న పుణ్యక్షేత్రాలను అధిక వ్యయ ప్రయాసలతో దర్శించి వెళ్లడం కన్నా ఇలాంటి అనాధలకు సహాయపడటం, నిర్వాహకులకు సహకరించడం ఎంతో పుణ్యం కలిగజేస్తుందని అన్నారు. వృద్ధాశ్రమ నిర్వాహకులు పట్నం జ్యోతి, పట్నం సామంత్ లను ఆయన ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ గొల్లపూడి భానుమతి, కొత్తగూడెం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి బత్తుల రామారావు, డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ పట్టుపల్లి నిరంజన్ రావు, మెండు రాజమల్లు,న్యాయశాఖ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు రామిశెట్టి రమేష్, సెక్రటరీ డి.రవి తదితరులు పాల్గొన్నారు.

Post a Comment