ఇంటికే టి.ఎస్.ఆర్టీసీ కార్గో పార్శిల్

ఇంటికే ఆర్టీసీ కార్గో పార్శిల్

జె.హెచ్.9. మీడియా, హైదరాబాద్: టిఎస్ ఆర్టిసి తమ కార్గో సేవలను ఇంటింటికి అందించేందుకు సిద్ధమైంది. దసరా కానుకగా ఈ సేవలను ప్రారంభించేందుకు టీఎస్ఆర్టీసీ అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఆన్ లైన్ లో బుక్ చేసుకుంటే నేరుగా ఇంటికి వచ్చి వస్తువును తీసుకువెళ్లడం..ఆ తర్వాత చెప్పిన అడ్రస్ కు డెలివరీ చేయనుంది కార్గో. బుక్ చేసుకునేందుకు వీలుగా ఇప్పటికే ప్రత్యేకమైన సాఫ్ట్ వేర్ ను రూపొందించారు. ఆర్డర్ పరిమాణాన్ని బట్టి టూ వీలర్, త్రీ వీలర్, ఫోర్ వీలర్లు వినియోగించేలా అధికారులు అని ఏర్పాట్లు చేశారు.

ఈ సేవలను మొదటగా హైదరాబాద్ సిటీలో అమలు చేయనున్నారు. అనంతరం జిల్లాలకు విస్తరించేటట్లు ప్రణాళిక రూపొందిస్తున్నారు టిఎస్ఆర్టిసి అధికారులు. 

అయితే ప్రస్తుతం ఎవరైనా సరే బుక్ చేసుకోవాలన్నా, డెలివరీ  వస్తువులను తీసుకోవాలన్నా బస్టాండ్ కు వెళ్లాల్సి వస్తుంది. ఇకపై ఈ డోర్ డెలివరీ సదుపాయంతో  వినియోగదారుడికి ఆ బాధ తప్పనుంది.. ఇంటి నుంచి సునాయాసంగా కార్గో ద్వారా వస్తువులను పంపడం.. అందుకోవడం చేయవచ్చు.

Blogger ఆధారితం.