సింగభూపాలెం చెరువు అభివృద్ధికి రూ.8.50కోట్లు మంజూరు

సింగభూపాలెం చెరువు అభివృద్ధికి రూ.8.50కోట్లు మంజూరు.

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం:  సింగభూపాలెం చెరువు అభివృద్ధికి, సుందరీకరణ కోసం 8.50 కోట్ల రూపాయలు నిధులు మంజూరు అయ్యాయని కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు తెలిపారు. 

శుక్రవారం సుజాతనగర్ మండలంలోని సింగభూపాలెం చెరువులో ప్రభుత్వం నుండి వంద శాతం ఉచితంగా ఒక లక్ష చేప పిల్లలను వారి చేతుల మీదగా చెరువులో వదిలారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కూనంనేని మాట్లాడుతూ సింగభూపాలెం చెరువు కాకతీయుల నాటి పురాతనమైన చెరువు అని, ఈ చెరువు ఆధారంగా వేల్లదిమంది  రైతులు ఉపాధి పొందుతున్నారని అన్నారు. 

సీతారామసాగర్ నీటి ద్వారా ఈ ప్రాంతంలో 2000 ఎకరాలకు నియోజవర్గం మొత్తం 25 వేల ఎకరాల సాగునీరు అదనంగా అందించడం కోసం కృషి జరుగుతుందన్నారు. ఎట్టి పరిస్థితిలో భద్రాద్రి జిల్లాలను, కొత్తగూడెం నియోజకవర్గాన్ని వదిలి సీతారామప్రాజెక్టు నీళ్లు ఇతర ప్రాంతాలకు వెళ్లనీయమన్నారు. రైతులకు నీటి వసతి చాలా ప్రధానమైనదని రెండు పంటలకు నీరు అందించడం కోసం ముఖ్యమంత్రి నీటిపారుదల శాఖ మంత్రులతో మాట్లాడి నియోజవర్గం మొత్తం నీటి సమస్యలు లేకుండా చెరువులు కాల్వల అభివృద్ధి కోసం నిధులు మంజూరుకు కృషి  చేస్తున్నామని అన్నారు. కాల్వల  అభివృద్ధి కోసం సుమారు వంద కోట్ల రూపాయలు నిధులు మంజూరు అయ్యాయని త్వరలోనే టెండర్లను పిలవడం జరుగుతుందన్నారు. 

ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె షాబీర్ పాషా, టిపిసిసి సభ్యులు నాగ సీతారాములు, పిఎసిఎస్ చైర్మన్ మండే హనుమంతరావు, మత్స్యశాఖ  అధికారి డిడి ఖదీర్ అహ్మద్, మత్స్య శాఖ జిల్లా అధికారి ఇంతియాజ్, జిల్లా అధ్యక్షులు బుచ్చన్న, ఇరిగేషన్ ఈ ఈ అర్జున్, డి ఈ భాస్కర్, డిప్యూటీ తాసిల్దార్ కూచిపూడి నాగరాజు, ఎంపీఓ శ్రీనివాస్, ఏవో నర్మదా, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ నిలోఫర్, ఏ ఈ కార్తీక్, సిపిఐ జిల్లా నాయకులు సభ్యులు భూక్య దస్రు, జక్కుల రాములు, కొమారి  హన్మంతరావు,  స్థానిక నాయకులు తాళ్లూరు పాపారావు ధర్మారావు, తాళ్ల వెంకటేశ్వర్లు, వీర్ల దుర్గాప్రసాద్, బొడ్డు కేశవరావు, మేకల వెంకటేష్, దండు సురేష్, దండి నరసింహారావు, వివిధ శాఖల అధికారులు, రాజకీయ నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.