జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన ఎస్పి
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: జిల్లా ప్రజలు, పోలీస్ అధికారులు, సిబ్బందికి జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్ విజయదశమి శుభాకాంక్షలు తెలుపుతూ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
ఆయన మాట్లాడుతూ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దసరా పండుగ ప్రజలందరి జీవితాల్లో సంతోషాన్ని నింపాలని అన్నారు. చేడు ఎంత శక్తివంతంగా కనిపిస్తున్నప్పటికి చివరికి మంచితనమే గెలుస్తుందని తెలిపారు.ఈ దసరా పండుగను ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషకరమైన వాతావరణంలో ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్పీ ఆకాంక్షించారు.

Post a Comment