తొలిసారి భద్రాద్రికొత్తగూడెం జిల్లా కు చేరుకున్న తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

తొలిసారి భద్రాద్రికొత్తగూడెం జిల్లా కు చేరుకున్న తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం :తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గురువారం తొలిసారి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా బూర్గంపాడు మండలం సారపాక ఐటీసీ గెస్ట్ హౌస్ లో గవర్నర్ కు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐటీడీఏ పీవో బి రాహుల్, ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఘన స్వాగతం పలికారు.

తొలిసారి భద్రాద్రికొత్తగూడెం జిల్లా కు చేరుకున్న తెలంగాణ గవర్నర్ విష్ణుదేవ్ వర్మ

అనంతరం గవర్నర్ కు పోలీస్ అధికారులు గౌరవ వందనం సమర్పించిన అనంతరం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఈవో రమాదేవి అర్చక స్వాములు గవర్నర్ కు సాంప్రదాయపరంగా పూజలు చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనాలు అందించారు. 

తొలిసారి భద్రాద్రికొత్తగూడెం జిల్లా కు చేరుకున్న తెలంగాణ గవర్నర్ విష్ణుదేవ్ వర్మ
ఈ కార్యక్రమంలో భద్రాద్రికొత్తగూడెం అదనపు కలెక్టర్ వేణుగోపాల్, భద్రాచలం ఆర్డీవో దామోదర్ రావు, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు

Blogger ఆధారితం.