జిల్లా జైల్ ను సందర్శించిన న్యాయమూర్తి జి. భానుమతి
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం :జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి గొల్లపూడి భానుమతి జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి ఖమ్మం జిల్లా జైలు ను గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ ఖైదీల యొక్క స్థితిగతులను అడిగి తెలుసుకుని వారి సందేహాలకు తగిన సలహాలు, సూచనలను చేసి వారికి న్యాయ చైతన్యం కల్పించారు.
తమ కేసులలో న్యాయవాదిని నియమించుకొనే స్తోమత లేని వారికి న్యాయసేవధికార సంస్థ ద్వారా ప్రభుత్వ న్యాయవాదిని నియమింపజేస్తామని ఈ విధంగా విచారణ ఖైదీలకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ న్యాయ సహాయం అందజేస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ నిరంజన్ రావు, ఖమ్మం జిల్లా జైలు సూపరింటెండెంట్ ఏ.శ్రీధర్, జైలర్ లక్ష్మీనారాయణ జైలు సిబ్బంది పాల్గొన్నారు. .

Post a Comment