లొంగిపోయిన మావోయిస్టులకు చెక్కులను అందజేసిన జిల్లా ఎస్పీ
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీలో పనిచేస్తూ ఇటీవల లొంగిపోయిన ఐదుగురు మావోయిస్టు సభ్యులకు రివార్డు నగదును చెక్కుల రూపంలో ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్ సోమవారం అందజేశారు.చర్ల పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చెక్కులు అందజేసిన అనంతరం ఎస్పీ మాట్లాడుతూ లొంగిపోయి సాధారణ జీవనం గడపాలనుకునే మావోయిస్టులకు ప్రభుత్వం తరఫున అందవలసిన అన్ని రకాల ప్రతిఫలాలను,పునరావాస సహాయాన్ని అందించే విధంగా పోలీస్ శాఖ తరపున బాధ్యత తీసుకుంటామని తెలిపారు.కావున నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన నాయకులు,సభ్యులు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసి మెరుగైన జీవితాన్ని గడపాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పి టి.సాయి మనోహర్,ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్,చర్ల సీఐ రాజువర్మ మరియు ఎస్సై నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
లొంగిపోయి చెక్కులను అందుకున్న వారు వీరే..
1)మడివి సోమమ్మ @ సునీత@గంగి W/o లింగా, R/o పొట్ట మంగు రివార్డ్:4,00,000/-
2) మడకం లింగా@రాకేష్ S/o చుక్కా,r/o పొట్ట మంగు
రివార్డ్: 4,00,000/-.
3) మడివి భద్రయ్య@భుద్ర@కృష్ణ S/o భీమయ్య,R/o ఎర్రంపాడు రివార్డ్:4,00,000/-.
4). కట్టం పొజ్జయ్య S/o గంగ, R/o పుట్టపాడు
రివార్డ్: 40,000/-.
5). కల్ము బుద్ర S/o దూల,R/o పుట్టపాడు
రివార్డ్: 20,000/- అందుకున్నారు.

Post a Comment