పాల్వంచలో ఘనంగా కొత్త కృష్ణారెడ్డి సంస్మరణ సభ

పాల్వంచలో ఘనంగా కొత్త కృష్ణ రెడ్డి సంస్మరణ సభ

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం:  తెలంగాణ ఉద్యమ నాయకుడు కొత్త కృష్ణారెడ్డి 9వ వర్ధంతి సభను మంగళవారం పాల్వంచలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షుడు యం.డి.మంజూర్ అలీ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఉద్యమకారులు పట్టణ ప్రముఖులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ కొత్త కృష్ణారెడ్డి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆది నుంచి అంతం వరకు పాల్వంచ ప్రజలను చైతన్య పరుస్తూ తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను తెలియజేస్తూ 2001 నుండి టిఆర్ఎస్ ఆవిర్భావం లో కీలకపాత్ర పోషించిన గొప్ప ఉద్యమ నాయకుడని అన్నారు. రాష్ట్రం ఆవిర్భావించిన కొంత సమయంలోనే ఆయన మరణించడం తీవ్ర బాధాకరమైన విషయం అని అన్నారు. పాల్వంచలో కొత్త కృష్ణారెడ్డి విగ్రహాన్ని నెలకొల్పాలని ప్రభుత్వాన్ని వారు కోరారు. 

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పాల్వంచ పట్టణ అధ్యక్షులు నూకల రంగారావు, బిఆర్ఎస్ పార్టీ పాల్వంచ పట్టణ అధ్యక్షులు మంతపురి రాజు గౌడ్, సీనియర్ జర్నలిస్ట్.. ఐ.జె.య. జాతీయ కౌన్సిల్ సభ్యులు చండ్ర నరసింహారావు, సీనియర్ జర్నలిస్ట్ తోట శ్రీనివాసరావు, క్రిష్ణా రెడ్డి కుమారుడు కొత్త వెంకట్ రెడ్డి,అరుణ్ రెడ్డి, టీయూఎఫ్ యువజన విభాగం రాష్ట్ర కన్వీనర్ యం.డీ. మసూద్, జై తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు సయ్యద్ రషీద్, అంతర్జాతీయ క్రీడాకారిణి సింధూ తపస్వి, న్యాయవాది అయిత గంగాధర్ రావు, ఉద్యమకారులు బుడగం నాగేశ్వరరావు, రేగళ్ల శ్రీను,బరగడి దేవదానం,పప్పు సుబ్బారావు,ఇజ్జగాని రవిగౌడ్,బొల్లం భాస్కర్, SDT హుస్సేన్, కట్టా అయిలయ్య,వెల శ్రీను,మంగళగిరి పూర్ణ,తాళ్లూరి సత్యనారాయణ, జయసింహారెడ్డి,భాష, జల్లారపు నాగేశ్వరరావు,ఉబ్బన శ్రీను,శనగ రామచందర్, నవభరత్ రాము,రామడుగు రామాచారి,చవ్వా సంతోష్,నబి, గొడ్ల‌ మోహన్ రావు, యోగి నాయక్, సురేష్ నాయక్, అబ్దుల్, సంపత్, ఆదిల్, అఖిల్ మహర్షి,బిల్లా సృజిత్, బిల్లా ముత్యం,రేగల గడ్డ అర్జున్,సముద్రాల ప్రభాకర్,లక్ష్మణ్, వర్ర తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.