ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: ఆదికవి వాల్మీకి మహర్షి జీవిత చరిత్రను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని గ్రంథ పాలకురాలు జి.మణి మృదుల అన్నారు. గురువారం వాల్మీకి మహర్షి జయంతిని జిల్లా గ్రంధాలయ సంస్థ ఆవరణలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జి.మణి మాట్లాడుతూ అధ్బుతమైన రామాయణ గ్రంథాన్ని మనకు అందించిన మహనీయుడు వాల్మీకీ అని అన్నారు. ప్రతి ఒక్కరూ వాల్మీకిని స్ఫూర్తిగా తీసుకొని ఆదర్శవంతులుగా జీవించి మంచి పేరు తెచ్చుకోవాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు

Post a Comment