మంత్రి కొండా సురేఖపై టాలీవుడ్ ఫైర్.. దిగి వచ్చిన మంత్రి
జె.హెచ్.9. మీడియా,హైదరాబాద్:మంత్రి కొండా సురేఖ పై టాలీవుడ్ ఫైర్ అవుతుంది. కేటీఆర్ తీరుతో సినీరంగంలోని పలువురు యాక్టర్స్ ఇబ్బంది పడ్డారని మంత్రి కొండా సురేఖ అన్నారు. కొందరు హీరోయిన్స్ త్వరగా పెళ్లి చేసుకొని ఇండస్ట్రీ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆర్ యే అని తీవ్ర విమర్శలు చేశారు. ఆయన మత్తు పదార్థాలకు అలవాటు పడి సినీ పరిశ్రమకు చెందిన కొందరిని వాటికి అలవాటు చేశారని రేవ్ పార్టీ చేయడంతో పాటు సినీ తారలను ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. ఇందులో భాగంగానే అక్కినేని నాగచైతన్య, సమంత విడాకులు తీసుకోవడానికి కూడా కేటీఆర్ కారణమని అన్నారు దీంతో ఒక్కసారిగా టాలీవుడ్ ఉలిక్కిపడింది. ఈ వ్యాఖ్యలను టాలీవుడ్ లోని పలువురు ప్రముఖులు తీవ్రంగా ఖండించారు. కొండా సురేఖ కామెంట్ ఇప్పుడు టాలీవుడ్ ని షేక్ చేస్తుంది.
సినిమా ఇండస్ట్రీపై కొండా సురేఖ ఇలాంటి కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదంటూ పలువురు సినీ ప్రముఖులు ఫైర్ అవుతున్నారు. సినిమా వాళ్ళని రాజకీయాల్లోకి లాగొద్దు అంటూ సినీ ప్రముఖులు స్పందించారు.
ఇక సమంత విడాకులపై కొండా సురేఖ చేసిన కామెంట్స్ పై సమంత స్పందించారు. " నా వ్యక్తిగత జీవితం అంటే అంత చిన్న చూపా..? నావిడాకులు సామరస్యంగా జరిగాయి. నేను రాజకీయాలకు అతీతంగా ఉంటాను అంటూ సమంత కౌంటర్ ఇచ్చారు".
అనంతరం కొండా సురేఖ కామెంట్స్ పై నాగార్జున స్పందిస్తూ " మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అబద్ధం.. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను" అని సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.
అదేవిధంగా నటుడు ప్రకాష్ రాజ్ తనదైన శైలిలో స్పందించారు. " ఏంటి సిగ్గులేని రాజకీయాలు.. అంటూ ఫైర్ అయ్యారు". మంత్రి కొండ సురేఖ వ్యాఖ్యలపై జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించారు. " బాధ్యత రహితంగా చిత్ర పరిశ్రమపై నిరాధార ప్రకటనలు చేయడం నిజంగా బాధాకరం. ఇతరులు మాపై ఇలాంటి ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదు" అంటూ ఆయన ట్విట్ చేశారు. నాచురల్ స్టార్ నాని ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ "ఏ చెత్త మాట్లాడిన చెల్లుతాదా? మీలాంటి నాయకులను చూస్తే అసహ్యం వేస్తుంది అని నాని ట్వీట్ చేశారు. మంత్రి కొండా సురేఖ కామెంట్స్ పై తెలుగు సినీ ఇండస్ట్రీలోని మరికొందరు ప్రముఖులు తమదైన శైలిలో ఘాటుగా స్పందించారు.
ఇలా సినీ ఇండస్ట్రీ తనపై విరుచుకుపడడంతో మంత్రి కొండా సురేఖ దిగివచ్చారు. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నాను అంటూ మంత్రి సురేఖ సోషల్ మీడియా వేదికగా రాస్కొచ్చారు. " మహిళా నాయకుల పట్ల ఓ నాయకుడు చిన్నచూపు ధోరణి ప్రశ్నించాలనేదే నా ఉద్దేశం. మీ మనోభావాలు దెబ్బతీయాలని కాదు. స్వశక్తితో మీరు ఎదిగిన తీరు నాకు ఆదర్శం. మీరు కానీ, మీ అభిమానులు కానీ మనస్థాపానికి గురైతే నా వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నా' అంటూ మంత్రి సురేఖ ట్వీట్ చేశారు.
దీంతో నటి సమంత వివాదం కొలిక్కి వచ్చినట్లే అని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Post a Comment