మంత్రి కొండా సురేఖకు నాగార్జున లీగల్ నోటీసులు ?
జె.హెచ్.9. మీడియా,హైదరాబాద్: సమంత, నాగచైతన్యపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాని సురేఖ ప్రకటించారు. అయినప్పటికీ మంత్రి మాటలపై కింగ్ నాగార్జున వెనక్కి తగ్గేదే లేదంటున్నారు. మంత్రి కొండా సురేఖ పై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు అక్కినేని నాగార్జున సిద్ధమవుతున్నారు.
"ప్రస్తుతం వైజాగ్‌లో ఉన్నానని, హైదరాబాద్ రాగానే చట్టపరంగా నోటీసులు పంపిస్తామని నాగ్ తెలిపారు. కొండా సురేఖ విషయం పై ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు.. చట్టపరంగా పోరాడతానని నాగార్జున సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు".
ఇప్పటికే తనపై చేసిన కామెంట్లకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంత్రి సురేఖకు లీగన్ నోటీసులు పంపిన విషయం తెలిసిందే. తన ప్రతిష్ఠకు భంగం వాటిల్లేలా చేసిన వ్యాఖ్యల పట్ల 24 గంటల్లోగా క్షమాపణ చెప్పాలని పేర్కొన్నారు. క్షమాపణ చెప్పని పక్షంలో చట్టప్రకారం పరువు నష్టం దావా వేయడంతోపాటు క్రిమినల్ కేసులు పెడతానని కేటీఆర్ హెచ్చరించారు. మరి ఈ వివాదం ముదిరి ఎంతవరకు వెళ్తుందో చూడాలి.

Post a Comment