కలల కొలువు సాధించిన వీసంశెట్టి వివేక కృషి అభినందనీయం - ఎమ్మెల్యే కూనంనేని

కలల కొలువు సాధించిన వీసంశెట్టి వివేక కృషి అభినందనీయం - ఎమ్మెల్యే కూనంనేని

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: పట్టుదలతో కృషి చేసి ప్రభుత్వ ఉద్యోగ కలను సాకారం చేసుకన్న వీసంశెట్టి వివేక కృషి  అభినందనీయమని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఇటీవల జరిగిన డీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఓపెన్ క్యాటగిరిలో ఉపాధ్యాయురాలుగా ఉద్యోగం సాధించిన సిపిఐ పాల్వంచ మండల కార్యదర్శి వీసంశెట్టి పూర్ణచందర్ రావు కుమార్తె వీసంశెట్టి వివేక ను శుక్రవారం కూనంనేని అభినందించారు. 


ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూనంనేని మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఎదగటానికి ఉపాధ్యాయులు బోధనే దోహదపడుతుందని, అలాంటి వృత్తిలో ఉద్యోగం సాధించిన వివేక ఉత్తమ ఉపాధ్యాయురాలుగా పేరు తెచ్చుకోవాలని సూచించారు. 
అనంతరం నియోజకవర్గ వ్యాప్తంగా ఉపాధ్యాయులుగా ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులందరికి  ఆయన అభినందనలు తెలిపారు. 

ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా, రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల విశ్వనాథం, పట్టణ కార్యదర్శి అడుసుమిల్లి సాయిబాబా, వివేక తల్లితండ్రులు సీపీఐ మండల కార్యదర్శి వీసంశెట్టి పూర్ణచంద్రరావు, వీ పద్మజ, జిల్లా సమితి సభ్యులు బండి నాగేశ్వరరావు, ఉప్పుశెట్టి రాహుల్, గుండాల నాగరాజు, డి.సుధాకర్, నాయకులు అన్నారపు వెంకటేశ్వర్లు, ఇట్టి వెంకట్రావు, శనగరపు శ్రీనివాసరావు, నరహరి నాగేశ్వరరావు, వైఎస్ గిరి, వేములపల్లి శేఖర్, భూక్యా విజయ్, రంజిత్, లాల్ పాషా, అజయ్, రవి తదితరులు పాల్గొన్నారు.

కూతురుతో  వీసంశెట్టి పూర్ణచందర్ రావు



Blogger ఆధారితం.