భాధితుల సమస్యలను త్వరగతిన పరిష్కరించండి- ఎస్పి రోహిత్ రాజ్
ఎస్పీ గ్రీవెన్స్ లో మొత్తం 15 మంది భాదితులు ఎస్పీ ని స్వయంగా కలిసి తమ సమస్యలను తెలుపుకున్నారు.ఇందులో నలుగురు భాధితులు జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో తమ ఫిర్యాదుల మేరకు నమోదైన కేసులలో జాప్యం జరగకుండా విచారణ జరిపించి తమకు న్యాయం చేకూర్చాలని కోరుతూ కేసుల వివరాలను ఎస్పీ కి తెలియజేసారు.ముగ్గురు భాదితులు తమ భూమికి సంబంధించిన విషయంలో న్యాయం కోరుతూ ఫిర్యాదు చేశారు.ఇద్దరు భాధితులు తమ ఇండ్లల్లో జరిగిన దొంగతనం కేసుల విషయమై దొంగలను పట్టుకుని పోగొట్టుకున్న తమ సొత్తును తమకు అప్ప చెప్పాలని కోరారు.
నలుగురు బాధితులు కుటుంబ కలహాల గురించి నమోదైన కేసుల విషయమై ఫిర్యాదు చేశారు. మరో రెండు ఫిర్యాదులు తమ అసోసియేషన్స్ విషయమై కొంతమంది వ్యక్తులు అక్రమాలకు పాల్పడుతున్నారని,వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేశారు. భాధితుల విషయంలో వెంటనే విచారణ చేపట్టి భాధితులకు న్యాయం చేయాలని సంబంధిత అధికారులకు ఎస్పీ ఆదేశించారు.

Post a Comment