800 మెగా వాట్స్ సేవాసమితి ఆధ్వర్యంలో గ్రంథాలయానికి పుస్తకాలు అందజేత

800 మెగా వాట్స్ సేవాసమితి ఆధ్వర్యంలో గ్రంథాలయానికి పుస్తకాలు అందజేత

 జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం:  కె.టి.పి.ఎస్ 7వ దశ  800 మెగా వాట్స్ సేవాసమితి ఆధ్వర్యంలో  శుక్రవారం పాల్వంచ లోని బొల్లేరుగూడెం  స్థానిక గ్రంథాలయానికి  వివిధ పోటీ పరీక్షలకు ఉపయోగపడే పుస్తకాలతో పాటు కుర్చీలను అందజేశారు. ఈ సందర్భంగా 800 మెగా వాట్స్ సేవాసమితి వారు  మాట్లాడుతూ  ప్రస్తుత రోజుల్లో విద్యార్థులకు చదువుతోపాటు పోటీ పరీక్షలపై అవగాహన అవసరమని అన్నారు.


గ్రూప్ వన్ ప్రిపరేషన్ మెటీరియల్స్ ను గ్రంథాలయంలో అందజేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కె.టి.పి.ఎస్ 7వ దశ  800 మెగా వాట్స్ సేవాసమితి...చుండూరు శ్రీనివాసరావు, జాస్త్రి శ్రీనివాస్, కిరణ్ కుమార్, జక్క ప్రసాద్, వేణు,యాస్మిన్, నరేందర్, అరుణ్ కుమార్, వరికూటి శ్రీనివాసరావు, లైబ్రరీ మధు బాబు, తదితరులు పాల్గొన్నారు.




Blogger ఆధారితం.