ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును పరిశీలించి సమస్యను పరిష్కరించండి - అదనపు కలెక్టర్
సోమవారం ఐడిఓసి కార్యాలయ సమావేశ మందిరంలో అన్ని శాఖల అధికారులతో ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
గ్రీవెన్స్ లో కొన్ని ఫిర్యాదులు..
సారపాక గ్రామం బూర్గంపాడు మండలం కి చెందిన కువారపు మంగ గత కొంతకాలంగా అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నానని సొంత స్థలం ఉన్నప్పటికి ఆర్థిక పరిస్థితి సరిగా కారణంగా ఇల్లు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నానని ప్రభుత్వం తరఫున ఇల్లు ఇప్పించాలని కోరుతూ చేసిన దరఖాస్తు ను పరిశీలించి జిల్లా హౌసింగ్ శాఖకు ఎండార్స్ చేశారు.
సారపాక గాంధీనగర్ కు చెందిన కువ్వారపు ప్రణవి ఎనిమిదో తరగతి చదువుతున్నానని భద్రాచలం లిటిల్ ఫ్లవర్ స్కూల్ నందు ఫ్రీ సీటు ఇప్పించగలరని చేసిన దరఖాస్తును తగు చర్యలు నిమిత్తం విద్యాశాఖ అధికారికి ఎండార్స్ చేశారు.
ఉప్పుసాక గ్రామపంచాయతీ పరిధిలోని రాజీవ్ నగర్ కాలనీకి చెందిన గిరిజన ఆదివాసీలు బీసీ కులస్తులు ఎస్టీ లంబాడ కులస్తులు వారు సుమారు 100 కుటుంబాలు నివాసం ఉంటున్నామని గత 30 సంవత్సరాలు నుండి తమకు కరెంటు సదుపాయం లేక అనేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. రాత్రివేళలో క్రిమికీటకాలు వల్ల తమకు ప్రాణహాని ఉన్నదని తమకు వెంటనే కరెంటు సదుపాయము, ఇంటి పన్నులు కట్టించుకొని తమకు న్యాయం చేయగలరని చేసిన దరఖాస్తును తగు చర్యల నిమిత్తం జిల్లా పంచాయతీ అధికారికి ఎండార్స్ చేశారు.
పాల్వంచ పట్టణ పరిధిలోని దమ్మపేట మెయిన్ రోడ్డు నుండి శివనగర్ ప్రవేశ రోడ్డు వరకు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా ధ్వంసం అయినదని, దశాబ్ద కాలం నాడు నిర్మించినటువంటి కాలువలు చిన్నవి అయిపోయి వరద ఉధృతికి సరిపోక నీళ్లన్నీ రోడ్డు పైకి, ఇళ్లల్లోకి ప్రవేశించి కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని కావున ధ్వంసమైన రోడ్డును పునర్నిర్మాణం, ప్రధాన కాల్వలు పూడికతీత, కాల్వలు పెద్దవిగా నిర్మించడం చేపట్టాలని శివనగర్ ప్రాంత వాసులు చేసిన దరఖాస్తును తగు చర్యలు నిమిత్తం మున్సిపల్ కమిషనర్ పాల్వంచకు ఎండార్స్ చేశారు.ఈ ప్రజావాణి కార్యక్రమంలో డీఆర్డీఓ విద్యా చందన, అన్ని శాఖలు అధికారులు పాల్గొన్నారు.

Post a Comment