ఏఎస్సై తిరుపతిరావును అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్

ఏఎస్సై తిరుపతిరావును అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్

జె.హెచ్.9. మీడియా, 
భద్రాద్రికొత్తగూడెం: 
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ప్రతిభ కనపరిచిన అధికారులకు ఇటీవల తెలంగాణ రాష్ట్ర డీజిపి జితేందర్ ఐపిఎస్ ప్రశంసా పత్రాలను అందజేశారు. ఇందులో భాగంగా జూలూరుపాడు పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న బి.తిరుపతిరావు "బెస్ట్ ఎంక్వయిరీ ఆఫీసర్" గా డీజీపీ చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్ సోమవారం  ఏఎస్ఐ తిరుపతిరావు ను ప్రత్యేకంగా అభినందించారు.పోలీస్ శాఖలో పనిచేసే ప్రతి ఒక్కరూ తమకు అప్పగించిన విధులను బాధ్యతతో,నిబద్ధతతో నిర్వర్తిస్తే ఎప్పటికైనా తగిన గుర్తింపు లభిస్తుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డిఎస్పి రెహమాన్,జూలూరుపాడు సీఐ ఇంద్రసేనారెడ్డి,ఎస్సై రాణాప్రతాప్, తదితరులు పాల్గొన్నారు.


Blogger ఆధారితం.