పదవీ విరమణ పొందిన ఏఎస్సైలను ఘనంగా సత్కరించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: పోలీస్ శాఖలో విధులు నిర్వర్తిస్తూ పదవీ విరమణ పొందిన ఏఎస్సైలు శ్యామ్ సుందర్ రావు, శ్రీనివాసరావు లను సోమవారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్ తన కార్యాలయంలో ఘనంగా సత్కరించారు.చుంచుపల్లి పోలీస్ స్టేషన్ నందు ఏఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న శ్యామ్ సుందర్ రావు, భద్రాచలం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో ఏఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న శ్రీనివాసరావు పోలీసు శాఖలో తమ సర్వీస్ ను ముగించుకొని పదవీ విరమణ పొందారు.
గత 40 సంవత్సరాలుగా పోలీస్ శాఖలో పనిచేస్తూ ప్రజలకు సేవలు అందించిన ఈ ఇద్దరు అధికారులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.పదవీ విరమణ అనంతరం ప్రభుత్వం నుంచి వారికి చెందాల్సిన అన్ని రకాల ప్రతిఫలాలను త్వరితగతిన అందేలా చర్యలు చేపట్టాలని జిల్లా పోలీస్ కార్యాలయ అధికారులకు సూచించారు.అనంతరం పదవీ విరమణ పొందిన పోలీసు అధికారుల కుటుంబ సభ్యుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.తమ శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడపాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎస్బి ఇన్స్పెక్టర్ నాగరాజు,వెల్ఫేర్ ఆర్ఐ కృష్ణారావు,జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులు శ్రీనివాసరావు,ఉపాధ్యక్షుడు ఏసోబు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment