ఓపెన్ టెన్త్ పరీక్షలను పకడ్బందీగా ఏర్పాట్లు చేయండి - అదనపు కలెక్టర్
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: అక్టోబర్ 3 నుండి 9 వరకు జరగనున్న ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అదనపు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ అన్నారు. శుక్రవారం ఐడిఓసి లోని సమావేశ మందిరంలో విద్యాశాఖ అధికారులతో ఇంటర్, ఓపెన్ టెన్త్ తరగతి పరీక్షల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్టోబర్ మూడు నుండి 9 వరకు థియరీ పరీక్షలు, 16 నుండి 23 వరకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు తెలిపారు.
పదవ తరగతిలో 596 మంది విద్యార్థులు, ఇంటర్ పరీక్షలకు 631 మంది, విద్యార్థులు హాజరు కానున్నట్లు తెలిపారు. జిల్లాలోని ఓపెన్ పదవ తరగతి, ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. ఆయా మండలాలలోని ఓపెన్ ఇంటర్ ఓపెన్ 10వ తరగతి పరీక్షా కేంద్రాలను ఆయా మండలాల తహసీల్దార్లు విధిగా తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఫ్లైయింగ్ స్క్వాడ్ , సెట్టింగ్స్ స్క్వాడ్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
పరీక్షా కేంద్రాలలో తాగునీటి వసతి, టెంట్లు ఏర్పాటు చేయాలని,అధికారులను ఆదేశించారు. పరీక్షలు ప్రతి ఒకరోజు ఉదయం 9:00 నుంచి 12:00 వరకు మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకు జరగనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఓపెన్ 10వ తరగతి, ఇంటర్ పరీక్షలు జరిగేలా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు , జిల్లా ఇంటర్మీడియట్ అధికారి వెంకటేశ్వరరావు, చుంచుపల్లి సిఐ వెంకటేశ్వర్లు, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.

Post a Comment