విద్యార్థులకు పర్యాటక ప్రాంతాల ప్రాముఖ్యత ను తెలపాలి - కలెక్టర్
ఈ విహారయాత్రలో రెండు బస్సుల్లో సుమారు 100 మందిన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యువత సమయం ఉన్నప్పుడు జిల్లాలోని ఉన్న పర్యాటక ప్రాంతాలకు ఎక్కువగా వెళ్లి వాటి యొక్క గొప్పతనాన్ని అందరికీ తెలియజేయడం ద్వారా మరింత అభివృద్ధి జరుగుతుందని, అలాగే బెండలపాడు అటవీ ప్రాంతం మరియు కనిగిరి గుట్టల వంటి ప్రకృతి ప్రదేశాలకు వెళ్లి ఆహ్లాదకరంగా గడిపి ఆ ప్రాంతం యొక్క గొప్పతనం అందరికి తెలియజేయాలని అన్నారు.
అనంతరం చంద్రుగొండ మండలం బెండలపాడు అటవీ ప్రాంత సందర్శనలో అశ్వరావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత, క్రీడాకారులు కలిసి ఈ ప్రాంతాన్ని సందర్శించడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ జిల్లాలో పర్యాటక ప్రదేశాలను బాగా అభివృద్ధి చేసుకోవాలని ప్రభుత్వం నుంచి అధిక నిధులు తీసుకుని వచ్చి బెండలపాడు కనిగిరి గుట్టల ప్రాంతం ను మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల అధికారి ఎం.పరందామా రెడ్డి, జిల్లా ప్లానింగ్ అధికారి, చండ్రుగొండ స్పెషల్ ఆఫీసర్ కే. సంజీవ రావు, శ్రీరామచంద్ర గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ప్రిన్సిపాల్ వనజ, ఎన్.ఎస్.ఎస్, ఎన్. సి.సి కో-ఆర్డినేటర్ పూర్ణ చందర్, అథ్లెటిక్ సెక్రటరీ మహిదర్, బాక్సింగ్ సెక్రటరీ రమేష్, కరాటే సెక్రటరీ శ్రీధర్, హాకీ కోచ్ ఇమామ్, ఆర్చీరి కోచ్ కళ్యాణ్, అథ్లెటిక్ కోచ్ నాగేందర్, క్రీడాకారులు, జూనియర్ కాలేజీ, సోషల్ వెల్ఫేర్ కాలేజీ విద్యార్ధులు పాల్గొన్నారు.

Post a Comment