పోషణ లోపం నివారణకు చర్యలు తీసుకోవాలి - జిల్లా కలెక్టర్

పోషణ లోపం నివారణకు చర్యలు తీసుకోవాలి - జిల్లా కలెక్టర్ జితీష్

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశం మందిరంలో పర్యవేక్షణతో కూడిన అనుబంధ పోషకాహార కార్యక్రమంపై జిల్లా వైద్య ఆరోగ్య, మహిళా శిశు సంక్షేమ శాఖకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ జిల్లాలో చిన్నారులకు పోషణ లోపం నివారణకి వైద్య శాఖ సమన్వయంతో క్షేత్రస్థాయిలో మెరుగైన సేవలు అందించి పోషణ లోపం లేకుండా చూడాలని అన్నారు. ప్రతినెల మొదటి వారంలో అంగనవాడి కేంద్ర పరిధిలో నమోదైన గర్భిణీలను, పిల్లల యొక్క ఎత్తు బరువులు చూసి వారి యొక్క ఆరోగ్య స్థితిగతిపై వైద్య శాఖ సమన్వయంతో ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని, క్షేత్రస్థాయిలో ఉన్న అంగనవాడి టీచర్లు ఎప్పటికప్పుడు వారి యొక్క ఆరోగ్య పరిస్థితులపై కుటుంబ సభ్యులకు తెలియజేసి సాధారణ స్థితికి వచ్చే వరకు పర్యవేక్షణ చేయాలని అన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో పెరటి తోటలు ఏర్పాటు చేసి స్థానికంగా లభించే పౌష్టికాహారాలపై గ్రామస్థాయిలో అవగాహన పెంచి ఆరోగ్య తెలంగాణ నిర్మాణానికి భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు 

 ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ వేణుగోపాల్ , జిల్లా సంక్షేమ అధికారిని వేల్పుల విజేత, డి ఐ ఓ బాలాజీ, జిల్లాలోని మెడికల్ ఆఫీసర్లు ,సిడిపిఓలు, సూపర్వైజర్లు, పోషణ అభియాన్ పాల్గొన్నారు.


Blogger ఆధారితం.