జగన్‌తో సెల్ఫీ...చిక్కుల్లో హెడ్ కానిస్టేబుల్
ఆంధ్రప్రదేశ్ : గుంటూరు జైలులో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేశ్ ను పరామర్శించేందుకు వచ్చిన మాజీ సిఎం వైఎస్ జగన్ తో సెల్ఫీ దిగేందుకు చాలా మంది పోటీ పడ్డారు. ఇందులో ఓ మహిళా కానిస్టేబుల్ కూడా ఉన్నారు. జగన్ ప్రెస్ మీట్ కు సిద్ధమవుతున్న సమయంలో అదే పనిగా ఆయన వద్దకు వచ్చిన ఓ మహిళా కానిస్టేబుల్ సెల్ఫీ తీసుకున్నారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఈ విషయం కాస్త సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, విధి నిర్వహణలో ఉన్న సమయంలో ఇలా వ్యవహరించడంతో మహిళా కానిస్టేబుల్‌పై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కానిస్టేబుల్ ఆయేషా బానుకు ఛార్జిమెమో ఇస్తామని జైలర్ రవిబాబు తెలిపారు. ఆమె వివరణ ఆధారంగా కమిటీ వేసి తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Post a Comment