డాక్టర్ విజయేందర్ రావు మృతి పట్ల కొత్తగూడెం బార్ అసోసియేషన్ సంతాపం
కొత్తగూడెం: డాక్టర్ విజయేందర్ రావు మృతి పట్ల కొత్తగూడెం బార్ అసోసియేషన్ సంతాపం ప్రకటించింది.
గురువారం కొత్తగూడెం జిల్లా కోర్టులో కొత్తగూడెం బార్ అసోసియేషన్ సభ్యులు సంతాప సభ నిర్వహించారు.
ఈ సందర్భంగా కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షులు లక్కినేని సత్యనారాయణ మాట్లాడుతూ రోటరీ క్లబ్ లో గవర్నర్ గా సేవలు అందించి అనేకమంది దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు అందించి, వైద్య వృత్తిలో గొప్ప పేరు తెచ్చుకున్న ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యుడు డాక్టర్ విజయేందర్ మరణం తీరనిలోటు అని అన్నారు.

తాము గొప్ప వైద్యుని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి వారు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు తోట మల్లేశ్వరరావు, కార్యదర్శి ఎం.ఎస్.ఆర్.రవి చంద్ర, కార్యవర్గ సభ్యులు సాధిక్ పాషా,దూదిపాల రవికుమార్, ఎస్ ప్రవీణ్ కుమార్, ప్రతిభ, సీనియర్ జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.

Post a Comment