హైడ్రాకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి వార్నింగ్


హైడ్రాకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి వార్నింగ్

జె.ఎచ్.9 మీడియా,హైదరాబాద్ : హైడ్రాకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి వార్నింగ్  ఇచ్చారు.జీహెచ్ఎంసీ లో జీతం తీసుకుంటూ హైడ్రాలో పనిచేస్తోన్న అధికారులపై ఆమె తాజాగా సీరియస్ అయ్యారు. ముఖ్యంగా విజిలెన్స్ విభాగం అధికారులు హైడ్రాను వీడటం లేదంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. 

హైడ్రా కమిషనర్‌కు జవాబుదారీగా ఉంటూ జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆదేశాలను పట్టించుకోవడం లేదని ఫైర్ అయినట్లు తెలుస్తోంది. తమ పరిధిలో పనిచేయని అధికారులకు ఇకపై జీతాలు ఇవ్వొద్దని ఆమె ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. రోజువారీ కార్యక్రమాలు, విచారణల్లో విజిలెన్స్ అధికారుల అవసరం ఉంటుందని స్థాయీ సంఘం సభ్యులు చెబుతున్నారు. కానీ వారంతా ఆ బాధ్యతలు నిర్వర్తించడం లేదని అంటున్నారు. ఈ 

మేరకు సభ్యుల అభ్యంతరం వ్యక్తం చేయడంతో జీహెచ్ఎంసీ కమిషనర్ తీవ్రంగా స్పందించినట్లు తెలుస్తోంది. 

Blogger ఆధారితం.