రైతులు పెసర కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
పెసర కొనుగోలు ను వేగవంతం చేయాలని సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ డిసిఎంఎస్ ద్వారా జిల్లాలో ఖమ్మం, వైరా ఏఎంసి లలో పెసర కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారన్నారు. పెసర్లు ఒక క్వింటాకు 8,682 రూపాయలు ప్రభుత్వ మద్దతు ధర ప్రకటించి కొనుగోలు చేస్తున్నదని కొత్వాల తెలిపారు. రైతులు డీసీఎంఎస్ పెసర కొనుగోలు కేంద్రాలలో పెసర్లు విక్రయించి ప్రభుత్వం మద్దతు ధర పొందాలని అన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కొత్వాల కోరారు.
ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ బిజినెస్ మేనేజర్ కె.సందీప్, డైరెక్టర్లు కుంచేపు వెంకటేశ్వర్లు, తోళ్ల కోటయ్య, మారుతీ యట్టయ్య, తదితరులు పాల్గొన్నారు.


.webp)
Post a Comment