పాలకులకు ముందు చూపులేకనే పెరిగిన నిత్యావసర ధరలు - ఎన్. ఎఫ్. ఐ.డబ్ల్యు
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: పాలకులకు ముందు చూపులేకనే నిత్యవసర ధరలు పెరిగాయని ఎన్.ఎఫ్.ఐ.డబ్ల్యు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వీసంశెట్టి పద్మజ అన్నారు. శుక్రవారం పాల్వంచ పట్టణంలోని వారి కార్యాలయంలో మహిళా సమాఖ్య పట్టణ కార్యవర్గ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పెరిగిన నిత్యవసర ధరలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. పాలకులకు ముందు చూపు లేకపోవడంతో రోజురోజుకు పెరుగుతున్న నిత్యవసర ధరలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. విచ్చలవిడిగా నిత్యవసర వస్తువులు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ పై ధరలు పెంచుతూ సామాన్యులు మోయలేని భారం మోపుతూ రాక్షస ఆనందం పొందుతున్నారని విమర్శించారు.
ఈకార్యక్రమంలో నాయకులు కమటం ఈశ్వరమ్మ, అనసూర్యమ్మ, త్రివేణి, కామిశెట్టి అప్పలమ్మ, మోతే వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment