రామలక్ష్మణులు మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం - కొత్వాల

రామలక్ష్మణులు మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం - కొత్వాల

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: కొత్తగూడెం ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలకు రామలక్ష్మణులు ఏంతో సేవ చేసారని, ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం అని డీసీఎంఎస్ చైర్మన్, రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. ఇటీవల మరణించిన కాంగ్రెస్ నాయకులు గుడివాడ రామలక్ష్మణులు సంస్మరణ సభను ఆదివారం కొత్తగూడెం క్లబ్ లో నిర్వహించారు. ఈ సందర్బంగా కొత్వాల మాట్లాడుతూ రామలక్ష్మణులు నిత్యం పేద ప్రజల సమస్యల పట్ల, కార్మికుల సమస్యల పట్ల ఏంతో రామలక్ష్మణులు స్పందించేవారని అన్నారు. ఆయన మరణం కొత్తగూడెం ప్రాంత ప్రజలకు తీరనిలోటని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కొత్వాల అన్నారు. 


ఈ కార్యక్రమంలో కొత్తగూడెం సొసైటీ అధ్యక్షులు మండే వీరహనుమంతరావు, కాంగ్రెస్ పార్టీ పాల్వంచ మండల అధ్యక్షులు కొండం వెంకన్న, సుజాతనగర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు చింతలపూడి రాజశేఖర్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు గొల్లపల్లి దయానంద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కాపర్తి వెంకటా చారి, వాసుమల్ల సుందర్ రావు, పాబోలు నాగేశ్వరరావు, రామశేషం రాజు, గుడివాడ రాము, పాత్రికేయులు లోగాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.