గ్రామపంచాయతీలలో ఏకో బ్రిక్స్ తయారీ చేపట్టాలి : జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్

గ్రామపంచాయతీలలో ఏకో బ్రిక్స్ తయారీ చేపట్టాలి : జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: స్వచ్ఛభారత్ మిషన్ గ్రామీణ్, స్వచ్ఛ హీ సేవ -2024 కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లోని పంచాయతీ కార్యదర్శులు  ఎకో బ్రిక్స్ తయారీ చేపట్టాలి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.జిల్లాలోని అందరు ఎంపీడీవోలకు,ఎంపీవోలు తమ మండలాల్లోని పంచాయతీలలో సెప్టెంబర్ 30 తేదీ లోపు ఎక్కువ మొత్తంలో ఏకో బ్రిక్స్ తయారు చేసేవిదంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

మండల స్థాయిలో ఎక్కవ మొత్తంలో ఏకో బ్రిక్స్ తయ్యారు చేసిన గ్రామపంచాయతీలను మండల స్థాయి టీమ్ సభ్యులైన ఏంపిడిఓ, ఎంపీవో, ఏపీవో, ఏపీఎం సభ్యులు ధ్రువీకరించి ఫొటోలతో డి ఆర్ డి ఏ కార్యాలయానికి సెప్టెంబర్ 30 సాయంత్రం 5:00 లోపు అందజేయాలని తెలిపారు. 

ఈ కార్యక్రమంలో భాగంగా ఎక్కువ మొత్తం లో ఏకో బ్రిక్స్ తయ్యారు చేసిన గ్రామపంచాయతీ కార్యదర్శులను జిల్లా స్థాయిలో ప్రాధన్యత క్రమంలో మొదటి పది స్థానాల్లో వచ్చిన వారికి అక్టోబర్ 1 న పాల్వంచలోని ఐడిఓసి కార్యాలయంలో సన్మాన కార్యక్రమం, మేమంటో బహుకరణ ఉంటుందని కలెక్టర్ తెలిపారు.

Blogger ఆధారితం.