ఎల్.ఐ.సి అధికారి పి.వి. రాజారావు పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొన్న కొత్వాల

ఎల్.ఐ.సి అధికారి పి.వి. రాజారావు పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొన్న కొత్వాల

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: జీవిత భీమా సంస్థ భద్రాచలం అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ పి.వి. రాజారావు పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా ఆదివారం కొత్తగూడెం లో కె.సి.ఓ.ఏ. క్లబ్ లో ఆయన పదవీ విరమణ మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్, రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు పాల్గొని, ఆయనను శాలువా, బొకే లతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో కొత్తగూడెం సొసైటీ అధ్యక్షులు మండే వీరహనుమంతరావు, కాంగ్రెస్ పార్టీ పాల్వంచ మండల అధ్యక్షులు కొండం వెంకన్న, సుజాతనగర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు చింతలపూడి రాజశేఖర్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు గొల్లపల్లి దయానంద్, నాయకులు కాపర్తి వెంకటా చారి, వాసుమల్ల సుందర్ రావు, పాబోలు నాగేశ్వరరావు, రామశేషం రాజు, గుడివాడ రాము, పాత్రికేయులు లోగాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.