స్వరాష్ట్ర సాధన కోసం తన జీవితాన్నే అంకితం చేసిన మహానీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ - ఎస్పీ

స్వరాష్ట్ర సాధన కోసం తన జీవితాన్నే అంకితం చేసిన మహానీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ - ఎస్పీ

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: స్వాతంత్ర సమరయోధుడు, తొలి,మలిదశ తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో కీలక భూమిక పోషించిన కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను శుక్రవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్  కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ అనంతరం ఎస్పీ మాట్లాడుతూ కొండా లక్ష్మణ్‌ బాపూజీ తొలి,మలిదశ తెలంగాణ ఉద్యమంలో తన జీవితాన్నే అంకితం చేసిన మహనీయుడని అన్నారు.ఆయన  స్వాతంత్ర  పోరాటం,నిజాం నిరంకుశ వ్యతిరేక ఉద్యమం,ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఐదు దశాబ్దాలుగా అలుపెరగని కృషి చేశారని అన్నారు. దేశసేవకు అంకితమైన వ్యక్తి కొండాలక్ష్మణ్‌ బాపూజీ  అని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో  ఏఆర్ డిఎస్పీ సత్యనారాయణ, డీసిఆర్బీ డిఎస్పీ మల్లయ్యస్వామి, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్బి ఇన్స్పెక్టర్ నాగరాజు,ఐటి ఇన్స్పెక్టర్ నాగరాజు రెడ్డి,కార్యాలయ ఏవో జయరాజు,ఆర్ఐలు సుధాకర్,లాల్ బాబు,కృష్ణారావు పాల్గొన్నారు

Blogger ఆధారితం.