మెగాస్టార్‌ చిరంజీవికి అరుదైన గౌర‌వం

 

మెగాస్టార్‌ చిరంజీవికి అరుదైన గౌర‌వం

జె.హెచ్.9. మీడియా,హైద‌రాబాద్‌: మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం ద‌క్కింది.గిన్నిస్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డుల్లో చిరంజీవి పేరు న‌మోదైంది. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ ఆదివారం హైద‌రాబాద్‌లోని ఓ హోట‌ల్‌లో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేశారు. 

ఇందుకు సంబంధించిన సర్టిఫికెట్‌ను చిరంజీవికి బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ సమక్షంలో గిన్నీస్ ప్రతినిధి రిచర్డ్ అంద‌జేశారు.చిరంజీవి పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డ్స్‌లో ఎక్క‌డంతో చిరు అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు :


ప్రతిష్ఠాత్మక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో మెగాస్టార్ చిరంజీవికి చోటు దక్కడంపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా చిరంజీవికి అభినందనలు తెలిపారు.‘ప్రముఖ సినీ నటుడు కొణిదెల చిరంజీవి గారికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో చోటు దక్కడం తెలుగు వారు గర్వించదగ్గ విషయం అంటూ ట్విట్టర్ వేదికగా చిరుకు రేవంత్ రెడ్డి విషెస్  తెలిపారు.
Blogger ఆధారితం.