రామగుండం ధర్మల్ స్టేషన్ ను జెన్కోనే నిర్మించాలి - టిజీపిఈఏ నాయకులు

 రామగుండం ధర్మల్ స్టేషన్ ను జెన్కోనే నిర్మించాలి - టిజీపిఈఏ నాయకులు


జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెంరామగుండం ధర్మల్ పవర్ స్టేషన్ స్థానంలో నిర్మించ తలపెట్టిన 800 మెగావాట్ల విద్యుత్ కేంద్రాన్ని టీజీ జెన్కో ఆధ్వర్యంలోనే నిర్మించాలని తెలంగాణ స్టేట్ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం మణుగూరు లోని బీటీపీఎస్ లో చీఫ్ ఇంజనీర్ బి.బిచ్చన్న కు టిజీపిఈఏ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా టిజీపిఈఏ నాయకులు పలు అంశాలను సీఈ దృష్టికి తీసుకువెళ్లారు. విద్యుత్ కేంద్రాలను నిర్మించే అనుభవమున్న ఇంజనీర్లు జెన్కో లో ఉన్నారని గుర్తు చేశారు. ఈ ధర్మల్ కేంద్రాన్ని జెన్కో, సింగరేణి సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించాలనుకోవడం సరైన చర్య కాదని ఖండించారు.కేటీపీఎస్ లోని పాత ప్లాంట్ స్థానంలో 1600 మెగావాట్ల సామర్థ్యం తో రెండు యూనిట్లు ,800 మెగావాట్ల సామర్థ్యంతో కేటీపీపీ లో మరో యూనిట్లను జెన్కో నిర్మించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ రీజినల్ అధ్యక్షులు బి.రవి ప్రసాద్, నాయకులు సి.హెచ్ రాజబాబు, రవితేజ, సాయి, రాము, ఆనంద్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.