నేరెళ్ల బాధితులకు న్యాయం చేస్తాం - సీఎం రేవంత్ రెడ్డి

నేరెళ్ల బాధితులకు న్యాయం చేస్తాం - సీఎం రేవంత్ రెడ్డి

జె.హెచ్.9. మీడియా, హైదరాబాద్రాజన్న సిరిసిల్ల జిల్లా నేరెళ్ల బాధితులకు న్యాయం చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో కలిసి నేరెళ్ల బాధితులు సచివాలయంలో ముఖ్యమంత్రి తో భేటీ అయ్యారు. 

2017 నాటి ఘటనల్లో ఇసుక లారీల వల్ల మనుషుల ప్రాణాలు పోతున్నాయని అడిగినందుకు తమపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని బాధితులు ఆరోపించారు. బాధ్యులైన పోలీస్ అధికారులతో పాటు థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీస్ సిబ్బందిపైనా చర్యలు తీసుకోవాలని బాధితులు సీఎంకు విజ్ఞప్తి చేశారు.


Blogger ఆధారితం.