నీట్ ఫలితాలలో ప్రతిభ చాటిన పాల్వంచ బిడ్డ

నీట్ ఫలితాలలో ప్రతిభ చాటిన పాల్వంచ బిడ్డ

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం :  నీట్ ఫలితాలలో తెలంగాణ రాష్ట్ర స్థాయిలో పాల్వంచ బిడ్డ ప్రతిభ చాటింది. పాల్వంచ కో ఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షులు కాంపెల్లి కనకేష్ పటేల్, సంధ్య పటేల్ దంపతుల ద్వితీయ కుమార్తె కాంపెల్లి కిరణ్మయి పటేల్ తెలంగాణ రాష్ట్ర మెడికల్ యూనివర్సిటీ అయినటువంటి కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ మంగళవారం విడుదల చేసినటువంటి ర్యాంకుల జాబితాలో రాష్ట్ర స్థాయిలో 128వ ర్యాంకు సాధించింది. పాల్వంచకు చెందిన కాంపెల్లి కిరణ్మయి పటేల్ నీట్ ఫలితాలలో రాష్ట్రస్థాయిలో 128వ ర్యాంకు సాధించడం పట్ల పలువురు ప్రముఖులు అభినందనలు తెలియజేశారు. 


కాంపెల్లి కిరణ్మయి పటేల్ చదువులో సరస్వతే..10వ తరగతి వరకు పాల్వంచలోని రెజినా కార్మల్ కాన్వెంట్ స్కూల్లో చదువుకొని  ఎస్.ఎస్.ఎసి లో 10 కి 10 జీపీఏ సాధించి స్కూల్ టాపర్ గా నిలిచింది. అనంతరం ఇంటర్మీడియట్ బైపీసీ గ్రూప్ శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్, బాచుపల్లి, హైదరాబాద్ లో చదివి 1000 మార్కులకు గాను 973 మార్కులు సాధించినది. 2024 లో జరిగిన నీట్ పరీక్షలలో 720 మార్కులకు గాను 673 మార్కులు సాధించి ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిలింగ్ మొదటి రౌండ్లో కాకతీయ మెడికల్ కాలేజీ వరంగల్ లో ఎంబిబిఎస్ సీట్ సాధించి ఇంకా మెరుగైన కాలేజీ కోసం తదుపరి రౌండ్ కౌన్సిలింగ్ కోసం వేచి చూస్తుంది. ఈ క్రమంలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర ర్యాంకులు కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ విడుదల చేయడంతో అందులో రాష్ట్ర స్థాయిలో 128వ ర్యాంకు సాధించింది. పాల్వంచ బిడ్డ చదువులో ప్రతిభ చాటుతూ   128వ ర్యాంకు సాధించడం పట్ల కాంపెల్లి కిరణ్మయి పటేల్ తల్లి,దండ్రులు కాంపెల్లి కనకేష్ పటేల్, సంధ్య పటేల్, అక్క కాంపెల్లి తన్మయి పటేల్ సంతోషం తో పాటు పాల్వంచలోని పలు స్వచ్ఛంద సేవా సంస్థలు, రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు, విద్యావేత్తలు కాంపెల్లి కిరణ్మయి పటేల్ కి అభినందనలు తెలిపారు.

Blogger ఆధారితం.