దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి - న్యాయమూర్తి జి. భానుమతి

దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి - న్యాయమూర్తి  జి. భానుమతి

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం:  దివ్యాంగులకు అంగవైకల్యం అడ్డు కాదని, ఆత్మస్థైర్యంతో  ముందడుగు వేస్తే సాధించలేనిది అంటూ ఏమి లేదని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి.భానుమతి అన్నారు. బుధవారం ప్రపంచ బధిరుల దినోత్సవం సందర్భంగా కొత్తగూడెం లోని బాబు క్యాంప్ లో ఉన్న భవిత సెంటర్ లో మూగ, చెవిటి పిల్లలకు మెడికల్ క్యాంపును నిర్వహించారు. 

ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ అంగవైకల్యాన్ని జయించి అనేకమంది దివ్యాంగులు అనేక రంగాలలో విజేతలుగా రాణించారని కొనియాడారు. అనంతరం కొత్తగూడెంలోని పన్నాలాల్ టెక్స్ టైల్ అధినేత నిరంజన్ కుమార్ అగర్వాల్ బదిరులకు వినికిడి మిషన్నుస్ న్యాయమూర్తి చేతుల మీదుగా అందించారు. పిల్లలకు బిస్కెట్, చాక్లెట్స్  ను న్యాయమూర్తి అందించారు. 

ఈ కార్యక్రమంలో కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ వి.పురుషోత్తం రావు, కొత్తగూడెం గవర్నమెంట్ హాస్పిటల్ మెడికల్ సూపర్డెంట్ డాక్టర్ ఎం.రాధా మోహన్, న్యాయవాదులు అడపాల పార్వతి, మెండు రాజమల్లు, ఎంఈఓ జుంకీలాల్,  డాక్టర్ బి. బాలాజీ, డాక్టర్ కే.సామ్సన్, నాగరాజు, ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్, భవిత సెంటర్ టీచర్ పొన్నం సిద్దయ్య, శ్రీరామ్, సంతోష్,  దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.