లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ ను సందర్శించిన జిల్లా ఎస్పీ
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం:వివిధ సమస్యలతో పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు సత్వర న్యాయం జరిగేలా భాద్యతగా విధులు నిర్వర్తించాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ అన్నారు. మంగళవారం లక్ష్మిదేవిపల్లి పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్ సందర్శించారు.
ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో నమోదైన పలు కేసులు వివరాలను అడిగి తెలుసుకున్నారు.పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులకు సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాలు జరగకుండా నిత్యం పెట్రోలింగ్ చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.నేర విచారణలో జాప్యం జరగకుండా బాధితులకు సత్వర న్యాయం చేకూరేలా బాధ్యతగా పనిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో చుంచుపల్లి సీఐ వెంకటేశ్వర్లు,ఎస్సై రమణారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

.webp)

Post a Comment