సత్వర న్యాయానికి లోక్ అదాలత్ - జిల్లా జడ్జి

సత్వర న్యాయనికి లోక్ అదాలత్ -  జిల్లా జడ్జి

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెంప్రస్తుత సమాజంలో రాజీమార్గమే మార్గదర్శకమని సత్వర న్యాయం కొరకై లోక్ అదాలత్ ను ఏర్పాటు చేసినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ తెలిపారు. శనివారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్  వసంత్ జిల్లా కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టులో శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్ కు విశేష స్పందన లభించింది. ఎస్బిఐ బ్యాంక్ - భద్రాద్రి కొత్తగూడెం వారి సౌజన్యంతో కక్షిదారులకు పులిహార, మంచినీటి సౌకర్యం ను కల్పించారు. 

ఈ కార్యక్రమంలో  జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి.భానుమతి, న్యాయమూర్తులు బి.రామారావు, సాయి శ్రీ, శివ నాయక్, న్యాయవాదులు, బ్యాంక్ మేనేజర్లు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.