కొత్తగూడెం జాతీయ లోక్ అదాలత్ లో బాధితులకు 73 లక్షల చెక్కు అందజేత

కొత్తగూడెం జాతీయ లోక్ అదాలత్  లో బాధితులకు 73 లక్షల చెక్కు అందజేత

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: కొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ జాతీయ  లోక్ అదాలత్ లో ప్రమాద బాధితురాలికి చెక్కును అందజేశారు. శనివారం రూ.73, 14,871 చెక్కు ను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ ఇన్సూరెన్స్ పంజాగుట్ట బ్రాంచ్ డిప్యూటీ మేనేజర్  ఎనమరెడ్డి మోహన నుండి ప్రమాదంలో చనిపోయిన రవికుమార్ భార్య వినోద వారి పిల్లలకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ అందజేశారు.

వివరాలలోకి వెళ్తే 2022 ఫిబ్రవరి 14న బానోత్ రవికుమార్ పాల్వంచ నుండి చుంచుపల్లి (మ) 3 ఇంక్లైన్ తండా లోని తన ఇంటికి వెళుతుండగా నవభారత్ వెంకటేశ్వర స్వామి గుడి వద్ద ఓ కారు రవికుమార్ మోటార్ సైకిల్ కు వెనుక నుండి డాష్ ఇవ్వగా రోడ్డుపై పడిపోయిన అతనికి తలకు బలమైన గాయాలు అయ్యాయి. స్థానికుడు బాధితుడిని ఆసుపత్రికి తీసుకువెళ్లగా అతను కోమాలోకి వెళ్లాడని వైద్యులు తెలిపారు. అనంతరం కొంత కాలానికి మృతి చెందాడు. అతని భార్య వినోద, కూతుళ్ళ, తల్లి తరఫున న్యాయవాదులు బాగo మాధవరావు, బానోతు దేవదాసులు కొత్తగూడెం కోర్టులో మోటార్ యాక్సిడెంట్ కేసు వేశారు. కేసు డిక్రి కాబడి, ఎస్బిఐ డిప్యూటీ మేనేజర్ మోహన ద్వారా రు.73, 14,871 చెక్కును అందజేశారు. 

ఈ కార్యక్రమంలో ఖమ్మం నుండి ఇన్సూరెన్స్ న్యాయవాదులు కొత్తపళ్లి రామారావు, గురజాల సీతారామారావు, శెట్టిపల్లి  వెంకట రామారావు, అంబటి రమేష్  తదితరులు పాల్గొన్నారు.



Blogger ఆధారితం.