జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలను నిత్యం అప్రమత్తం చేస్తూ ఉండాలని పోలీసులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్ సూచించారు. శనివారం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోని కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా పోలీస్ అధికారులతో నెలవారీ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
.webp)
జిల్లాలో భారీ వర్షాల కారణంగా ఏర్పడిన వరదల సమయంలో గణేష్ నవరాత్రులు,నిమజ్జన కార్యక్రమాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అంకితభావంతో అహర్నిశలు ప్రజలకు సేవలందించిన అధికారులు, సిబ్బందికి ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ కృతజ్ఞతలు తెలిపారు. కొత్త కొత్త టెక్నాలజీలతో సైబర్ నేరగాళ్లు అమాయక ప్రజల ఖాతాల నుండి నగదు మాయం చేస్తున్నారు అని అన్నారు.ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా అనునిత్యం అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ వారిని అప్రమత్తం చేయాలని పోలీసులకు తెలిపారు. ప్రతీ కేసులో సమగ్ర దర్యాప్తును చేపట్టి "క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్" ద్వారా నేరస్తులకు శిక్ష పడే విధంగా బాధ్యతగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని పోలీసులకు ఆయన ఈ సందర్భంగా తెలిపారు. దొంగతనం కేసుల్లో చోరీ సొత్తును రికవరీ చేసి బాధితులకు న్యాయం చేయాలని సూచించారు.పెండింగ్ లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో భద్రాచలం ఏఎస్పీ అంకిత్ కుమార్ సంక్వర్ ఐపిఎస్, ఇల్లందు డిఎస్పీ చంద్రభాను,కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్,పాల్వంచ డిఎస్పీ సతీష్ కుమార్, మణుగూరు డిఎస్పీ రవీందర్ రెడ్డి, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్,ఎస్బి ఇన్స్పెక్టర్స్ నాగరాజు, శ్రీనివాస్,ఐటి సెల్ ఇన్స్పెక్టర్ నాగరాజు రెడ్డి,జిల్లా పోలీస్ కార్యాలయ ఏవో జయరాజు, సీఐలు,ఎస్సైలు,సిబ్బంది పాల్గొన్నారు.
Post a Comment