చాకలి ఐలమ్మ పోరాట పటిమను ఆదర్శంగా తీసుకోవాలి - ఎస్పీ
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: భూమి కోసం,భుక్తి కోసం రైతాంగ సాయుధ పోరాటం చేసి,మహిళల్లో పోరాట స్ఫూర్తిని నింపిన తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ పోరాట పటిమను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్ కోరారు.
గురువారం చాకలి ఐలమ్మ 129వ జయంతి సందర్భంగా ఎస్పీ కార్యాలయంలో ఆమె చిత్రపటానికి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ వెనుకబడిన కులంలో జన్మించి దళారులతో ఎదురైన అవమానాలకు ఎదురొడ్డి వారిపై నిర్విరామ పోరాటం చేసి దొరల పాలనకు చరమగీతం పాడిన వీరమహిళ అని అన్నారు.ఆమె పోరాటంతో 10 లక్షల ఎకరాల భూమి పేదలకు దక్కిందని తెలిపారు. ప్రపంచానికి తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన ఐలమ్మ జీవితం ఆదర్శనీయమని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏఆర్ డిఎస్పీ సత్యనారాయణ, డీసిఆర్బీ సీఐ శ్రీనివాస్,ఎస్బి ఇన్స్పెక్టర్స్ నాగరాజు, శ్రీనివాస్,సైబర్ క్రైమ్స్ ఇన్స్పెక్టర్ జితేందర్,ఐటి సెల్ ఇన్స్పెక్టర్ నాగరాజు రెడ్డి,అడ్మిన్ ఆర్ఐ లాల్ బాబు,ఎంటిఓ సుధాకర్,వెల్ఫేర్ ఆర్ఐ కృష్ణారావు,పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు, కార్యాలయ ఏవో జయరాజు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment