న్యాయవాది అంకం మల్లేష్ కన్నుమూత
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : న్యాయవాది అంకం మల్లేష్ కన్నుమూశారు. గురువారం న్యాయవాది అంకం మల్లేష్ కు దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడగా కొత్తగూడెంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొంది మెరుగైన వైద్యం కోసం ఖమ్మం వెళ్లగా అనారోగ్యంతో మృతి చెందారు. న్యాయవాది మల్లేష్ మృతికి కొత్తగూడెం బార్ అసోసియేషన్ సంతాపం తెలిపింది.
సంతాపం తెలిపిన వారిలో కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షులు లక్కినేని సత్యనారాయణ, కార్యదర్శి రవిచంద్ర, ఉపాధ్యక్షుడు తోట మల్లేశ్వరరావు, కార్యవర్గ సభ్యులు, సీనియర్, జూనియర్, మహిళా న్యాయవాదులు ఉన్నారు.

Post a Comment