మహిళా లోకానికే వన్నె తెచ్చిన వీరనారి చాకలి ఐలమ్మ - కొత్వాల

ఉద్యమస్ఫూర్తితో మహిళా లోకానికే వన్నె తెచ్చిన తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ -  కొత్వాల

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: భూస్వాముల పెత్తందారీ విధానాలపై తనదైన శైలిలో ఉద్యమించి, ఉద్యమస్పూర్తితో మహిళా లోకానికే వన్నె తెచ్చిన తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ అని డీసీఎంఎస్ చైర్మన్, రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి సందర్బంగా గురువారం పాల్వంచ పోలీస్ పెట్రోల్ బంక్ వద్ద బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు మస్నా  శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొత్వాల ముఖ్య అతిధిగా పాల్గొని చాకలి ఐలమ్మ చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా కొత్వాల మాట్లాడుతూ రజాకార్ల పరిపాలనలో దొరల పాలిట సింహస్వప్నంగా, వారి నాయకత్వాన్ని బలహీన పరిచి, ఆదర్శంగా నిలిచిన ఉద్యమ నేత ఐలమ్మ అని కొనియాడారు. ఆమె ఇచ్చిన స్ఫూర్తితో అందరూ బలహీన, వెనుకబడిన వర్గాల అభివృద్ధికై కృషి చేయాలని కొత్వాల అన్నారు. 

ఈ కార్యక్రమంలో పాల్వంచ మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న, కాంగ్రెస్ నాయకులు కాపర్తి వెంకటాచారి, వాసుమల్ల సుందర్ రావు, శనగా రాంచందర్ రావు, గంధం నరసింహారావు, విశ్రాంత ఉద్యోగి ఎస్. శివ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.