యువత స్వామి వివేకానంద జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి - కలెక్టర్

యువత స్వామి వివేకానంద జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి - కలెక్టర్

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: యువత స్వామి వివేకానంద జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కొత్తగూడెం క్లబ్ లో జరిగిన జిల్లాస్థాయి యువజనోత్సవాలలో భాగంగా బుధవారం జిల్లా క్రీడా, యువజన శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతపైన అపారమైన భారం ఉంటుందని, ఏదైనా యువతతోనే సాధ్యం అవుతుందని, దానికి అనుగుణంగా యువత ముందుకు సాగాలని అన్నారు. యువత స్వామి వివేకానంద జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. కొమురం భీం ఇదే అటవీ ప్రాంతంలో తిరిగారన్నారు. అదేవిధంగా రుద్రమదేవి ఆనవాళ్లు చండ్రుగొండ గుట్టల పైన ఇంకా కనబడుతున్నాయని, శక్తివంతమైన వ్యక్తులు శక్తివంతమైన ప్రాంతం నుండి వస్తారని వారిని స్ఫూర్తిగా తీసుకొని యువత ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాని ఇంకా అభివృద్ధి పరచాలని కోరారు. .

ఈ కార్యక్రమంలో డి.ఆర్.డి.ఓ విద్యా చందన, జిల్లా క్రీడా, యువజన శాఖాధికారి పరంధామ రెడ్డి, జిల్లా సైన్స్ ఫెయిర్ అధికారి చలపతిరావు, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి వెంకటేశ్వర్లు  మరియు మైనింగ్ కళాశాల ప్రిన్సిపల్ జగన్ మోహన్ రాజు తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.