పారిశుధ్య కార్మికుల సేవలు అభినందనీయం - జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: ప్రజల ఆరోగ్య పరిరక్షణకు, పరిశుభ్రతకు నిత్యం కృషి చేస్తున్న పారిశుధ్య కార్మికుల సేవలు అభినందనీయమని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. బుధవారం స్వచ్చతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా పాల్వంచ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులకు ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్యశిబిరాన్ని జిల్లా కలెక్టర్.. డీఎంహెచ్ ఓ భాస్కర్ నాయక్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపాలిటీలో పరిశుభ్రతపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని కార్మికులకు సూచించారు.
అనంతరం ఉత్తమ సేవలు అందించిన పలువురు పారిశుద్ధ్య కార్మికులను ఆయన సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, పాల్వంచ మున్సిపల్ కమిషనర్, అధికారులు, కార్మికులు పాల్గొన్నారు.

Post a Comment