రైతుల సంక్షేమానికి సొసైటీ పాలకవర్గం కృషి ఉంటుంది - రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ కొత్వాల

రైతుల సంక్షేమానికి సొసైటీ పాలకవర్గం కృషి ఉంటుంది - రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ కొత్వాల

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: పాల్వంచ మండలంలోని రైతుల సంక్షేమానికి సొసైటీ పాలకవర్గం కృషి ఉంటుందని పాల్వంచ కో ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులు, డీసీఎంఎస్ చైర్మన్, రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. పాల్వంచ సొసైటీ జనరల్ బాడీ సమావేశం సోమవారం సంఘ కార్యాలయంలో నిర్వహించారు. సమావేశంలో మండలంలోని రైతులు, సొసైటీ సభ్యులు, పాలకవర్గం సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా కొత్వాల మాట్లాడుతూ రైతులకు రుణాలు పంపిణీ, ఎం.ఆర్.పి ధరలకు ఎరువులు, సబ్సిడీపై విత్తనాలు పంపిణీ, కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వ మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు వంటి కార్యక్రమాలు చేపట్టి రైతులకు అందుబాటులో ఉంటున్నామన్నారు. 

పాల్వంచ సొసైటీ ద్వారా 591మంది రైతులకు 1కోటి 77 లక్షల రుణమాఫీ:


ప్రభుత్వం చేపట్టిన రుణమాఫీ ద్వారా పాల్వంచ సొసైటీ నుండి 591 మంది రైతులకు 1 కోటి 77 లక్షలు రుణమాఫీ అయిందని కొత్వాల అన్నారు. 219 మంది రైతులకు 86 లక్షలు తిరిగి రుణాలు పంపిణీ చేసామన్నారు. రుణమాఫీ అయిన రైతులకు కూడా సాంకేతిక కారణాల వలన నిలిపి వేసినట్లయితే వెంటనే వ్యవసాయ శాఖ అధికారిని సంప్రదించాలన్నారు. సొసైటీ ద్వారా ఏర్పాటు చేసే కార్యక్రమాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కొత్వాల రైతులను కోరారు. 

ఈ సమావేశంలో సొసైటీ వైస్ చైర్మన్ కాంపెల్లి కనకేష్, పాల్వంచ మండల వ్యవసాయాధికారి శంభో శంకర్, డిసిసిబి సూపర్ వైజర్ సురేష్, సొసైటీ డైరెక్టర్లు బుడగం రామ్ మోహన్ రావు, కనగాల నారాయణ, చౌగాని పాపారావు, సామా జనార్దన్ రెడ్డి, జరబన సీతారాంబాబు, మైనేని వెంకటేశ్వరరావు, భూక్యా కిషన్, బర్ల వెంకట రమణ, సీఈఓ జి. లక్ష్మీనారాయణ, సురేందర్ రెడ్డి, లక్ష్మి, శోభారాణి తదితరులు పాల్గొన్నారు.


Blogger ఆధారితం.