కటక్.. ఇప్టా జాతీయ సభలో పాల్గొన్నరాష్ట్ర కార్యదర్శి వేముల కొండలరావు
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: అఖిలభారత కళాకారుల సంఘం ఇండియన్ పీపుల్స్ థియేటర్స్ అసోసియేషన్ (IPTA) జాతీయ కౌన్సిల్ సమావేశాలు 3 రోజులపాటు ఒడిస్సా రాజధాని భువనేశ్వర్, కటక్ లో ఘనంగా జరిగాయి. ఈ సమావేశాలకు 25 రాష్ట్రాల నుండి పలువురు ప్రముఖులు హాజరు కాగా తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి వేముల కొండలరావు తో పాటు జనరల్ సెక్రెటరీ పల్లె నరసింహ, అద్యక్షుడు కె. శ్రీనివాస్, ఉపాద్యక్షులు ఉప్పలయ్య, స్వామి, కన్నా లక్ష్మీనారాయణ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి వేముల కొండలరావు, తదితరులను ఇప్టా జాతీయ నాయకులు ఘనంగా సన్మానించారు. కటక్ లోని ప్రముఖ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఆడిటోరియం లో ఇప్టా జాతీయ కౌన్సిల్ సమావేశాలు కళాకారులు దేశభక్తి గీతాలతో ప్రారంభించగా.. ఇప్టా పతాకాన్ని జాతీయ కౌన్సిల్ అధ్యక్షులు ప్రసన్న ఎగురవేశారు.
అనంతరం దేశంలో ఇప్టా కళా రంగంలో వివిధ రాష్ట్రాలలో పనిచేసి అమరులైన కళాకారులు,దేశ ప్రముఖులు, అంతర్జాతీయ ప్రముఖులకు, ఇఫ్టా జాతీయ కౌన్సిల్ సంతాపాన్ని తెలుపుతూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. సమావేశంలో భాగంగా జనరల్ సెక్రెటరీ గత సంవత్సర కాలంగా జరిగిన కార్యకలాపాలపై నివేదికను ప్రవేశపెట్టారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి ప్రతినిధులుగా పాల్గొన్న కళాకారులు ఆయా రాష్ట్రాల్లో జరిగిన కార్యక్రమాలను తెలిపారు. ఈ సందర్భంగా దేశంలో పెరుగుతున్న మత ఉన్మాదం, ధరల పెరుగుదల తదితర అంశాలపై వివిధ కళా సంస్థలను సాంస్కృతిక ఉద్యమంలో పాల్గొనే విధంగా ఐక్య కళారూపాలతో ప్రజల్లోకి వెళ్లాలని తీర్మానం చేసింది.
రాత్రి 7 :00 గంటల నుండి కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు, కథక్ శాస్త్రీయ నృత్యం, నాటికలు ప్రదర్శించారు. సభకు ముందు భగత్ సింగ్ జయంతి సభను ఘనంగా నిర్వహించారు.
ఈ సమావేశాలకు మూడు రోజులపాట ఆతిథ్యం ఇచ్చిన ఒరిస్సా కు ఇప్టా కృతజ్ఞతలు తెలిపింది."హమ్ హోంగే కామ్ యాబ్'' గీతంతో సమావేశం ముగిసింది.


.webp)

Post a Comment