వ్యక్తిని గాయపరిచిన కేసులో ముగ్గురికి జరిమానా
కేసు వివరాలు ఇలా జూలూరుపాడుకు చెందిన కొల్లిపాక వెంకటేశ్వర్లు తన ఎనిమిది కుంటల భూమిలో ఫెన్సింగ్ వేయుటకు 2017 మే 2న మధ్యాహ్నం తన తమ్ముడు శ్రీను, తన కుమారులు సంతోష్,సురేష్ లతో కలిసి ఫెన్సింగ్ వేస్తుండగా మీకు ఇక్కడ భూమి ఎక్కడది రా ఇక్కడికి ఎందుకు వచ్చారని బండ బూతులు తిట్టుతూ మంగళగిరి సుధాకర్, మంగళగిరి రవి, మంగళగిరి మార్కండేయులు అనే వ్యక్తులు కర్రలతో కొట్టగా రక్తసిక్తంగా గాయపరిచారు.
అనంతరం జూలూరుపాడు పోలీసు వారికి బాధితులు ఫిర్యాదు చేయగా అప్పటి ఎస్సై రాజేష్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు అనంతరం కోర్టులో చార్షీట్ దాఖలు చేశారు. కోర్టులో 9 మంది సాక్షులు విచారించగా ముగ్గురు వ్యక్తులపై నేరం రుజువు కాగా ఒక్కొక్కరికి 1500 రూపాయలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.
ప్రాసిక్యూషన్ విశ్వశాంతి, నాగలక్ష్మి లు నిర్వహించారు. మహమ్మద్ అబ్దుల్ ఘని ( కోర్టు డ్యూటీ ఆఫీసర్), జూలూరుపాడు కోర్టు పిసి ఉపేందర్ రావు లు సహకరించారు

Post a Comment